Tuesday, January 6, 2009

Cricket.....

క్కొక్కొరొకో అంటూ తెల్లారే లోపే మ్యాచే మొదలైతే పోయే మత్తు...
తరికిటతా అంటూ తాండవమే చేసే ఆనందం రేపే ఆటే క్రికెటు...
ఫోరైతే ఊరంతా హోరే కదరా
రమ్యంగా రణరంగం చూపే కథరా
మరునిముషం మలుపిచ్చే ఆరాటాల పోరాటంలా

రానీ...కానీ...చెయినీ బోణీ
పోతే పోనీ ఆటే గెలిచిందనుకోనీ...
చూసీ...తోసీ...పథకం వేసీ...
పోతే కాశీ... విశ్లేషించేసే..
లక్షల్లో లక్ష్మల్లే జనమే కదరా...
లక్ష్యాన్నే చేదించే తపనే కనరా...
తీక్షణతో వీక్షించే నిరీక్షణ ఫలించేనా...

వేగం... మర్మం... దృష్టే గమనం...
ఆగం... తగ్గం... పరిగెడుతూ ఉందాం...
చూడు...దూకు...పడితే గమ్యం...
రెపో...మాపో...హీరోలైపోదాం...
దేశాన్నే విదేశాల్లో చాటిన గెలుపు...
సచినంటి తేజముకే లేదట అదుపు...
ముగింపులో తెగింపులే చేసే వైనం నేర్చెయ్ నేస్తం...