Thursday, June 17, 2010

Situation - boy singing abt gal !

తిప్పుతావు.. తిరగమన్నానా అంటావు...
అందుతావు....అందుకో చూద్దామంటావు...
అలాకాదంటావూ...అలాగే అంటావూ....ఇలాగే ఉంటూంటే....ఎలాగసలూ...
సరాగాలిస్తావూ.... సరిగ్గా ఉంటావూ... సవాలే వేస్తూంటే... సరే అనవూ...

వీరుడంటూ పొగిడేస్తావు వీకునెస్సులు చూపిస్తావు
వింతలాగా అనిపిస్తూంటే నవ్వి పోతావు...
జాలి చూపే దారిస్తావు జారి మునిగే లోతిస్తావు
జాబిలల్లే జోకొడుతూనే నిద్రనిస్తావు...
తుఫానై తగిలావూ... సవాలై మిగిలావూ... కలేనా అంటున్నా...ఇలా తిరుగు...
అలాకాదంటావూ...అలాగే అంటావూ....ఇలాగే ఉంటూంటే....ఎలాగసలూ...

కోరుకుంది కనిపెడతావు కోరి ఇస్తే కాదంటావు
కారుమబ్బై కనిపిస్తూనే సాగిపోతావు..
సాయమిస్తే ష్ అంటావు సాగనిస్తే సై అంటావు
నన్ను నాకే మైమరపిస్తూ నవ్వుకుంటావు..
ఉగాదై వస్తావూ.... నిగారింపిస్తావూ....నగారా మోగిస్తా... వినీ పిలుపూ...
సరాగాలిస్తావూ.... సరిగ్గా ఉంటావూ... సవాలే వేస్తూంటే... సరే అనవూ...

Wednesday, May 26, 2010

parody to ఓ మహాత్మా ఓ మహర్షీ by శ్రీశ్రీ

ఏది మనిషి... ఏది మృగము
ఏది జీవం.... ఎది క్లోను
ఏది మధువు... ఏది చదువు
ఏది నగలు... ఏది పగలు
ఏది కెరటం.... ఏది సునామీ
ఏది తిట్టు.... ఏది ముద్దు
ఏది న్యూసు.... ఏది వ్యూసు
ఏది బూతు... ఏది చాటు
ఏది ఆట.... ఏది వేట
ఏది లంచం.... ఏది కొంచెం
ఏది లాలి.... ఏది గోల
ఏది సిస్టం.... ఏదరిత్ష్టం
ఓ ప్రొడ్యూసర్... ఒ కంజ్యూమర్...

Wednesday, December 23, 2009

college...

కని పెరిగిన బాల్యంలా కనిపించదు కాలేజీ
ఊరించే ఊహలనే చూపించును దేఖోజీ
టీచర్లే ఫ్యూచర్ లో అవుతారు స్నేహితులే
వార్డెన్ లే స్టూడెంట్ లకి అవుతారు బాధితులే
సమరాలని సంధిస్తూ
అపరాత్రికి చదివిస్తూ
వారించును ఓడిస్తూ
కేరింతలు కొట్టిస్తూ
గగనాన్నే గమ్యంగా చూపించును దారిస్తూ
బంధాన్నే అందంగా బాధించును పంపిస్తూ...

Thursday, December 17, 2009

A song on dying farmers and regional disparities.

ఓ.. కర్షకుడా
ఓ.. లోక రక్షకుడా..

అమ్మ వంట అద్భుతమని పొగిడినానే..
అన్నపూర్ణ బిడ్డవి నిను మరిచినానని...

డబ్బు కొరకు దేశాన్నే వదిలినానే...
నా బాగు కొరకు పొలం కూడా వదలలేవని...

దారి లేక ఆత్మ హత్య కోరుతావే...
దారి చూపలేక ఆత్మ వంచన చేసినాని...

కట్టు బట్ట పూటకొకటి తొడుగుతానే...
నీ పంచ కట్టు పట్నంలో గిట్టబోదని...

రాజకీయ కుట్ర సాక్షినౌతానే...
దొంగ హామీ కోర్టు కేసు గెలవబోవని...

Thursday, October 8, 2009

love story !!!

--------నువ్వెక్కడున్నా... నేనిక్కడున్న...
--------నువ్వెక్కడున్నా... నేనిక్కడున్న...
(నువ్వు)ఛీ కొట్టుకున్నా... చీకట్లు కన్నా...
(నేను) చెంగట్టుకున్నా... చేయ్పట్టుకున్నా...
(నువ్వు)వదిలించుకున్నా... రగిలించుకున్నా...
(నేను) తలదించుకున్నా...తగిలించుకున్నా...
(నువ్వు)కలతెన్చుతున్నా...అడిగించుకున్నా...
(నేను) పూజించుతున్నా... ప్రేమించమన్నా...
(నా)--యదమాటునున్న... వేలుగందుకున్న...
--------నీ ఓర్పు కన్నా... మన ప్రేమ మిన్న... (కన్నా= కనినా )

Friday, September 4, 2009

I live in a river..

I live in a river..

moving forward forever...

if the flow is against me, I swim aginst it...

if theres declivity, I follow it..

if my leg pains, I stop...

if I find somebody, I hold him..

if I find a boat with many people, I'll get into it..

if a storm comes, I'll help them..

if the boat breaks, I'll jump...

because I live in a river...

I learn catching swiftly moving fish...

I build a raft with the floating logs...

I see beautiful landscapes...

I smile at my image in the freshwater...

I escape from hitting the trenches when I fall from the waterfall..

I'll come back into the river...

I enjoy the cuckoo's voice..

I get intimidated to the waterfall's sound..

I didn't see whirlpools...

I didn't see crocodiles..

If they attack, I'll fight...

if they dominate, I'll swim away...

I remind those who gave me send off...

I dream of going into the sea...

I'll learn that sea water is salty..

I'll learn that sea water doesn't flow..

I'll learn that sea water is unlimited..

When I die, I float..

I'll reach the shore..

I remain as one among the many corpses there..

నేను ఒక నదిలో ఉంటా....

నేను ఒక నదిలో ఉంటా....

ముందుకు పోతూ ఉంటా...

ప్రవాహం వెనక్కి తోస్తే ఎదురీదుతా..

ప్రవాహం పరవళ్ళు తొక్కితే సాగిపోతా...

నరం పట్టెస్తే ఆగిపోతా...

మనిషి దొరికితే పట్టుకుంటా...

మనుషులున్న పడవ దొరికితే ఎక్కుతా...

తుఫాను వస్తే ధైర్యం ఇస్తా...

పడవకి కన్నం పడితే దూకేస్తా...

ఎందుకంటే నేను ఒక నది లో ఉంటా...

చేపలని ఇట్టే పట్టే పద్ధతి నేర్చుకుంటా...

దొరికిన చెక్కలతో తెప్ప కడతా...

చక్కని అరన్యాలను చూస్తూ ఉంటా...

స్వచ్చమైన నీరు దొరికిథే నా మొహం నేను చూసుకొని నవ్వుకుంటా,,,

జలపాతం లో అగాధం నుండి తప్పించుకుంటా...

మళ్ళి నది లోకి వచ్చెస్తా...

కొయిల పాట విని నవ్వుతా...

జలపాతం హోరు విని భయపడతా...

నేను సుడిగుండాన్ని చూడలేదు...

నేను ముసళ్ళను చూడలేదు...

ఒక వేళ వస్తే పొట్లాడతా... కుదరకపొతే పారిపోతా..

నన్ను సాగనంపిన వాళ్ళని తలుచుకుంటా...

ఎలాగైనా సముద్రానికి వెళ్ళాలని కలలు కంటా...

సంద్రంలో ఉండెది ఉప్పు నీరని తెలుసుకుంటా...

సంద్రంలొ ప్రవాహం ఉండదని తెలుసుకుంటా...

సంద్రంలొ అనంతమైన నీరుందని తెలుసుకుంటా...

చచ్చిపోతే తేలిపొతా...

ఒడ్డుకొచ్చి వాలిపొతా...

ఒడ్డులో ఉన్న లెక్కలేని శవాలలో ఒకడిగా మిగిలిపొతా...