Friday, September 4, 2009

నేను ఒక నదిలో ఉంటా....

నేను ఒక నదిలో ఉంటా....

ముందుకు పోతూ ఉంటా...

ప్రవాహం వెనక్కి తోస్తే ఎదురీదుతా..

ప్రవాహం పరవళ్ళు తొక్కితే సాగిపోతా...

నరం పట్టెస్తే ఆగిపోతా...

మనిషి దొరికితే పట్టుకుంటా...

మనుషులున్న పడవ దొరికితే ఎక్కుతా...

తుఫాను వస్తే ధైర్యం ఇస్తా...

పడవకి కన్నం పడితే దూకేస్తా...

ఎందుకంటే నేను ఒక నది లో ఉంటా...

చేపలని ఇట్టే పట్టే పద్ధతి నేర్చుకుంటా...

దొరికిన చెక్కలతో తెప్ప కడతా...

చక్కని అరన్యాలను చూస్తూ ఉంటా...

స్వచ్చమైన నీరు దొరికిథే నా మొహం నేను చూసుకొని నవ్వుకుంటా,,,

జలపాతం లో అగాధం నుండి తప్పించుకుంటా...

మళ్ళి నది లోకి వచ్చెస్తా...

కొయిల పాట విని నవ్వుతా...

జలపాతం హోరు విని భయపడతా...

నేను సుడిగుండాన్ని చూడలేదు...

నేను ముసళ్ళను చూడలేదు...

ఒక వేళ వస్తే పొట్లాడతా... కుదరకపొతే పారిపోతా..

నన్ను సాగనంపిన వాళ్ళని తలుచుకుంటా...

ఎలాగైనా సముద్రానికి వెళ్ళాలని కలలు కంటా...

సంద్రంలో ఉండెది ఉప్పు నీరని తెలుసుకుంటా...

సంద్రంలొ ప్రవాహం ఉండదని తెలుసుకుంటా...

సంద్రంలొ అనంతమైన నీరుందని తెలుసుకుంటా...

చచ్చిపోతే తేలిపొతా...

ఒడ్డుకొచ్చి వాలిపొతా...

ఒడ్డులో ఉన్న లెక్కలేని శవాలలో ఒకడిగా మిగిలిపొతా...

2 comments:

Dheeraj Sayala said...

Nice :)
Memunna padava daggaraki vaste definitega neeku cheyyandinchi paiki laagutaa.. :D

ramana murthy said...

ఒడ్డు కొచ్చి వాలిపోతా ......ఒడ్డు పై వున్న లెక్కలేని ' బతికున్న శవాలతో '....ఒకడి గా చేరి పోతా !