Wednesday, December 23, 2009

college...

కని పెరిగిన బాల్యంలా కనిపించదు కాలేజీ
ఊరించే ఊహలనే చూపించును దేఖోజీ
టీచర్లే ఫ్యూచర్ లో అవుతారు స్నేహితులే
వార్డెన్ లే స్టూడెంట్ లకి అవుతారు బాధితులే
సమరాలని సంధిస్తూ
అపరాత్రికి చదివిస్తూ
వారించును ఓడిస్తూ
కేరింతలు కొట్టిస్తూ
గగనాన్నే గమ్యంగా చూపించును దారిస్తూ
బంధాన్నే అందంగా బాధించును పంపిస్తూ...

Thursday, December 17, 2009

A song on dying farmers and regional disparities.

ఓ.. కర్షకుడా
ఓ.. లోక రక్షకుడా..

అమ్మ వంట అద్భుతమని పొగిడినానే..
అన్నపూర్ణ బిడ్డవి నిను మరిచినానని...

డబ్బు కొరకు దేశాన్నే వదిలినానే...
నా బాగు కొరకు పొలం కూడా వదలలేవని...

దారి లేక ఆత్మ హత్య కోరుతావే...
దారి చూపలేక ఆత్మ వంచన చేసినాని...

కట్టు బట్ట పూటకొకటి తొడుగుతానే...
నీ పంచ కట్టు పట్నంలో గిట్టబోదని...

రాజకీయ కుట్ర సాక్షినౌతానే...
దొంగ హామీ కోర్టు కేసు గెలవబోవని...

Thursday, October 8, 2009

love story !!!

--------నువ్వెక్కడున్నా... నేనిక్కడున్న...
--------నువ్వెక్కడున్నా... నేనిక్కడున్న...
(నువ్వు)ఛీ కొట్టుకున్నా... చీకట్లు కన్నా...
(నేను) చెంగట్టుకున్నా... చేయ్పట్టుకున్నా...
(నువ్వు)వదిలించుకున్నా... రగిలించుకున్నా...
(నేను) తలదించుకున్నా...తగిలించుకున్నా...
(నువ్వు)కలతెన్చుతున్నా...అడిగించుకున్నా...
(నేను) పూజించుతున్నా... ప్రేమించమన్నా...
(నా)--యదమాటునున్న... వేలుగందుకున్న...
--------నీ ఓర్పు కన్నా... మన ప్రేమ మిన్న... (కన్నా= కనినా )

Friday, September 4, 2009

I live in a river..

I live in a river..

moving forward forever...

if the flow is against me, I swim aginst it...

if theres declivity, I follow it..

if my leg pains, I stop...

if I find somebody, I hold him..

if I find a boat with many people, I'll get into it..

if a storm comes, I'll help them..

if the boat breaks, I'll jump...

because I live in a river...

I learn catching swiftly moving fish...

I build a raft with the floating logs...

I see beautiful landscapes...

I smile at my image in the freshwater...

I escape from hitting the trenches when I fall from the waterfall..

I'll come back into the river...

I enjoy the cuckoo's voice..

I get intimidated to the waterfall's sound..

I didn't see whirlpools...

I didn't see crocodiles..

If they attack, I'll fight...

if they dominate, I'll swim away...

I remind those who gave me send off...

I dream of going into the sea...

I'll learn that sea water is salty..

I'll learn that sea water doesn't flow..

I'll learn that sea water is unlimited..

When I die, I float..

I'll reach the shore..

I remain as one among the many corpses there..

నేను ఒక నదిలో ఉంటా....

నేను ఒక నదిలో ఉంటా....

ముందుకు పోతూ ఉంటా...

ప్రవాహం వెనక్కి తోస్తే ఎదురీదుతా..

ప్రవాహం పరవళ్ళు తొక్కితే సాగిపోతా...

నరం పట్టెస్తే ఆగిపోతా...

మనిషి దొరికితే పట్టుకుంటా...

మనుషులున్న పడవ దొరికితే ఎక్కుతా...

తుఫాను వస్తే ధైర్యం ఇస్తా...

పడవకి కన్నం పడితే దూకేస్తా...

ఎందుకంటే నేను ఒక నది లో ఉంటా...

చేపలని ఇట్టే పట్టే పద్ధతి నేర్చుకుంటా...

దొరికిన చెక్కలతో తెప్ప కడతా...

చక్కని అరన్యాలను చూస్తూ ఉంటా...

స్వచ్చమైన నీరు దొరికిథే నా మొహం నేను చూసుకొని నవ్వుకుంటా,,,

జలపాతం లో అగాధం నుండి తప్పించుకుంటా...

మళ్ళి నది లోకి వచ్చెస్తా...

కొయిల పాట విని నవ్వుతా...

జలపాతం హోరు విని భయపడతా...

నేను సుడిగుండాన్ని చూడలేదు...

నేను ముసళ్ళను చూడలేదు...

ఒక వేళ వస్తే పొట్లాడతా... కుదరకపొతే పారిపోతా..

నన్ను సాగనంపిన వాళ్ళని తలుచుకుంటా...

ఎలాగైనా సముద్రానికి వెళ్ళాలని కలలు కంటా...

సంద్రంలో ఉండెది ఉప్పు నీరని తెలుసుకుంటా...

సంద్రంలొ ప్రవాహం ఉండదని తెలుసుకుంటా...

సంద్రంలొ అనంతమైన నీరుందని తెలుసుకుంటా...

చచ్చిపోతే తేలిపొతా...

ఒడ్డుకొచ్చి వాలిపొతా...

ఒడ్డులో ఉన్న లెక్కలేని శవాలలో ఒకడిగా మిగిలిపొతా...

Tuesday, August 11, 2009

Dedicated to all the lazy guys in the world ! (parody to confusion confusion from kotha bangaru lokam)

confusion confusion ఊహంతా confusion... తప్పేదో ఒప్పేదో తవ్వని confusion...
confusion confusion మసకల్లే confusion.. చాయేదో మాయేదో తేలని confusion...
నిన్నే తెలిసింది ఉరికే బ్రతుకు ఎందుకనీ... నేడే మళ్ళీ మరిచింది...
ఆపై వెతికింది నిన్నటి జాబుల జాడలని... తీరా తెలిసిందీ పోయిన కాలం మళ్ళీ దొరకదనీ......


lazy గా గడిపానూ.... easy గా అలిసానూ...
రాజిలే పడ్డానూ.... కదలని వదలని ఓటమితో...
ఔతుందౌతుందంటూ చూసే గతిలేనీ బ్రతుకే...
చెస్తే గాని అవ్వదు అంటూ అనుకోలేదే...
వస్తుందొస్తుందంటూ పలికే మతిలేనీ మనసే...
కదలని పాదం పయనం చేస్తే కోరిన తీరం ఎపుడూరాదే....

వేషాలే చూసానూ... మోసాన్నే పట్టానూ...
కాని ఏం చేసానూ... కదపని మెదపని ఒరిమితో...
కలినే కనిన కనులే కలతై... కలవరమై కుమిలే...
కదిలే కాలం కపటంలాగా కనిపించిందే...
అడిగే వాడే లేడా అంటూ నేనేంచైలేదే...
పనినే వదిలే ప్రతిభా పోయే మళ్ళి గతమే వెతకాల్సొచ్చిందే ....

Tuesday, April 28, 2009

Dedicated to the Scientist human !

(A parody to 'tikamaka makatika' song frm 'sri anjaneyam !')


సరిగమ స్వరముకు మధురిమ గుర్తించీ
పదనిస పలికిన గళమును గమనించీ
కాలాన్ని లెక్కవేసీ........ ప్రశ్నల్ని వరస పేర్చీ ........
జ్ఞానాన్ని వెతికి తీసి....... శాస్త్రాన్ని కూర్పు చేసీ ..........
వస్తువుతో పాటనే పాడించిన మనిషీ....

వింతై తోచినా మాయే అనుకున్నా
జిజ్ఞాస నడిపించే జ్ఞాన రథం వెతికిందా సృష్తిలో కణం...
నిత్యాశ వాడుకుంది ఈ విజ్ఞానం చూపింది నవోదయం...
ఈ నిత్య సుఖాలు లొకమంతటా తెలిసీ...
ఆ సత్య యుగంలా ధర్మమంతటా వెలిసీ...
నాకము నెలకొల్పరా మనిషి....

ఎదురే లేక నిదరే పోక
ఇష్తంగా పనిపెంచే ఉత్సుకతయే తెచ్చిందా భువికే అందం
తెలివంతా అర్పించే ఈ యజ్ఞాన్ని కష్టమంటూ ఎపుడూ అనం..
నీ కుతూహలానికి అడ్డుకట్టలే లేవు కదా..
నువ్ కళేబరంలా బ్రతకటానికీ కాదు కదా...
దూరాన్నే క్షణాల్లో దరిచేర్చిన మనిషి...

Monday, April 20, 2009

venki train song - tune king lo 'enthapani sestiviro'

(naagaraju: venumadhav - tc, bokka- AVS, gajjigadu - (gajala)- br)


anupallaavi :
మంచిగుంటే మీకు మంటా.... తెచ్చినాదే పెద్ద తంటా...
మందు వేస్తే ఎవ్వడైనా.... మనిషి లాగా ఉండడంటా...
pallavi:

ఎట్లగున్న పర్వలెదురో పోకిరోడ పాట పాడి పరవశింప రా రా...
కొట్టి కొట్టి సెప్పలేను రో తింగరోడ ఆటలాడి ఆదమరచిపోరా...
పొలోమంటు పారిపోతె పచ్చి నెత్తురు తాగెస్తా...
అలగనీ calmగుంటె పిచ్చ పీకుడు పీకెస్తా...
flashback గుర్తొస్తే గుండె లోన బాధరన్నా...
ఎందుకిలా సేసిందీ నాగరజు అన్న...
పోరి ఎందుకిలా సేసిందీ నాగరజు అన్న...
వీడివల్లె వీడిందీ పెళ్ళిముడోరన్నో...
వీడివల్లె వీడిందీ పెళ్ళిముడోరన్నో...

para1:

wife కొరకు ఎదురు చూసినా.... గొప్ప life time plan వెసినా...
రైలు లొన sight కొట్టిన.... గాలి లొన తేలి కేళి సేసినా...
హై అంటే నవ్వుకుందిగా....లవ్వంటే కెవ్వుమందిగా....
మనసంతా ముక్కలైందిగా.... తననైనా మరవలేనుగా....
ఎట్టాగ చెప్పు మరీ... సెయ్మాకు బెట్టు మరీ...వెయ్ రా నువ్ step మరి బొక్కా...
ఎందుకిలా సేసిందీ నాగరజు అన్న...
పోరి ఎందుకిలా సేసిందీ నాగరజు అన్న...
వీడివల్లె వీడిందీ పెళ్ళిముడోరన్నో...
వీడివల్లె వీడిందీ పెళ్ళిముడోరన్నో...

para2:
venky:
ఆశపడ్డ గుండె పగిలితే..... ఆ ఆశకింక ఊపిరేడ రా...
వెను మధవ్ :
ఇట్లగైతె ఏమి వచ్చు రా.... వీడి సంగతేంటొ చూపు చూడరా...
venky:
పొద్దున్నే తగిలాడే శనిగాదు గజ్జిగాదిలా...
మనిషేమో పొట్టోడూ ఊరుకుంటే కసురుతాడిలా...
చెసాడే తప్పు మరీ.... అడగాలే సారి అనీ.... రేయంతా నిదరపొమాకా...
వీడివల్లె వీడిందీ పెళ్ళిముడోరన్నో...
ఎదవ వీడివల్లె వీడిందీ పెళ్ళిముడోరన్నో...
ఎందుకిలా సేసిందీ నాగరజు అన్న...
పోరి ఎందుకిలా సేసిందీ నాగరజు అన్న...

Tuesday, January 6, 2009

Cricket.....

క్కొక్కొరొకో అంటూ తెల్లారే లోపే మ్యాచే మొదలైతే పోయే మత్తు...
తరికిటతా అంటూ తాండవమే చేసే ఆనందం రేపే ఆటే క్రికెటు...
ఫోరైతే ఊరంతా హోరే కదరా
రమ్యంగా రణరంగం చూపే కథరా
మరునిముషం మలుపిచ్చే ఆరాటాల పోరాటంలా

రానీ...కానీ...చెయినీ బోణీ
పోతే పోనీ ఆటే గెలిచిందనుకోనీ...
చూసీ...తోసీ...పథకం వేసీ...
పోతే కాశీ... విశ్లేషించేసే..
లక్షల్లో లక్ష్మల్లే జనమే కదరా...
లక్ష్యాన్నే చేదించే తపనే కనరా...
తీక్షణతో వీక్షించే నిరీక్షణ ఫలించేనా...

వేగం... మర్మం... దృష్టే గమనం...
ఆగం... తగ్గం... పరిగెడుతూ ఉందాం...
చూడు...దూకు...పడితే గమ్యం...
రెపో...మాపో...హీరోలైపోదాం...
దేశాన్నే విదేశాల్లో చాటిన గెలుపు...
సచినంటి తేజముకే లేదట అదుపు...
ముగింపులో తెగింపులే చేసే వైనం నేర్చెయ్ నేస్తం...