Thursday, December 25, 2008

rail bandi..

చుకు చుకు మంటూ చక చక కదిలీ...
అడిగిన చోటుకు చేయును బదిలీ..

సేవను చాటే దేవత మాదిరి..
లీలగ గాంచును పయనము వైఖరి...

సమయంకే ఇది tension కాదా..
పట్టము తెచ్చెను ఠీవీ హోదా..

అచ్చ తెలుగులో ధూమసక్టమిది...
ఇనుప పెట్టెలో జగతి చూపునిది...

Monday, December 15, 2008

my definition for life..(please read this...and give f/b)

sing the song with the tune of "nammaka tappani" from bommarillu..

మమతను మరిపిన తమకమిదా........ మమతలు మరువని తరుణమిదా........ ఏ దిశ తెలుపును ఒంటరితనమిట్టా...
సడి లేకుందా బ్రతుకు ఎలా....... గడియారం లా గడుపు ఇలా....... వివరణ దొరికెను ఒంటరి నిముషానా...
గతమే గమనిస్తున్నా..... నా భవితే కలగంటున్నా...... ఇప్పటి కాలం కరిగిస్తూ ఉన్నా...
స్వర్థం సాకే అయినా..... నువు మాయే అనిపిస్తున్నా......ఏకాంతంగా వేంటే వస్తున్నా...

ఈ జగమంతా నడిపే వెలుగంతా చీకటి చీల్చుతు చిమ్ముతు వుందని సంబరపడిపోనా
ఈ జనులంతా సహనం లేకుండా తొందరపాటును పొందిక చేసిన గాధకి వ్యధపడనా
భగవంతుడు మనిషి కదా
పనిమంతుడు రాజు కదా
నా భావం నా వరుకేను కదా...

నే బల్యంలో నేర్చిన ఈ నీతుల్లో ఎన్నని లోకం పాటించిందని ప్రశ్నిస్తూ ఉన్నా
నా గమనంలో గమ్యం చేరువలో గోడలు దాటే తెలివే ఓర్పని బదులిస్తూ ఉన్నా
ప్రేమన్నది ఇరుపక్షమా
కాకుంటే చేదు నిజమా
గాయాలను మలిచే జీవితమా....

Wednesday, December 10, 2008

situation: duet...

పల్లవి:
M:నీ కళ్ళే ముళ్ళై చటుక్కున ఎదనే గుచ్చెనే...
ఆ మాయేమితొ నేనాపై బాధే మరిచెనే...
F:ఈ దూరం అడ్డొస్తూంటే దూరంగా నే తరమనా...
నీడై కలనై ఊపిరై నీతో నిలవనా...

M:గాలిలో సరిగమలే నీ జతే వరమనెలే....
F:విరహమై పెరిగెనులే ఊహలో ఉరవడులే...
M:తొందరే తరిమేనా మనువు తరుణానికీ...

చరణం1:
M:గుర్తున్నాయా... నే నీకై చదివిన చిలిపి కవితలన్నీ..
కనిపించాయా... నా లేఖ లోన హరివిల్లు రంగులన్నీ...
F:తెలిసొచ్చాయా... నా నవ్వే తెలిపిన వలపు సైగలన్నీ...
మురిపించాయా... ఈ వరసే కలిపిన మధుర స్మ్రుతులు అన్నీ...
M:అది ఒక ఇది కదగా
F:ఇక ఇదినిక మరవనుగా
M:సంతోషమే వెన్నంట ఉండీ శ్రీకారం పలికించదా...

చరణం2:
M:ఎదిరిస్తావా... ఈ లొకమే నన్ను వలచద్దంతూంటే
వదిలెస్తావా... నీ ఆశలే నన్ను కలవద్దని చెబిటే
F:రానంటానా... నీ కలలకే నన్ను గమ్యమే చెయ్యగా
తోడే అవనా... నీ గాధలో సగభాగమే అవ్వగా
M:ఇహమే ఒక మనమై
F:మరు జన్మే మన కధని
M:మరచిపోకుండ ఉండేలాగా బ్రతుకుదామా మరి...

Friday, November 28, 2008

situation:daroo party..

p1:మందు...జనులందరికీ పసందు...తలకెక్కిన పూటొక విందు...గమ్మత్తుగ గడిపై రా..
p2:ముందు...మొదలెట్టాలమ్మా చిందు...మరి దొరకదు మళ్ళీ సందు...తహతహగా తాగై రా..
p2:తూగుతున్నా తుమ్మెదలా...సాగుతున్నా నెమ్మదిగా...
గీత దాటే నడవడిక...మాట రాదే నిలకడగా..
p1:అరె భాయి..ఈ రాతిరి అంతా మత్తు జాతరేగా...
p2:అరె భాయి..నీ సొణుగుడు ఆపీ చీర్సు కొట్టవేరా..


p1:మైకమనే లోకంలోన కొలువై ఉన్నాడు...మందను మహిమగల దేవుడు
p3:పైకమునే బానిస చేసిన రాజొకడున్నాడు...మదిలో మనిషై ఉన్నాడు...తాగుడు ఆపద్దన్నాడు..
p2:తాగని వాడు ఎనభై ఏళ్ళకి మరణిస్తున్నాడు....ఆపై స్వర్గం చూస్తాడు...
తాగిన మనము నలభై ఏళ్ళకి మరణించేలోపే...మందులొ స్వర్గం చూసాము...అందులొ విలాసమొందామూ...
p1:అరె భాయి....ఈ మందుకి మందని పేరుపెట్టినోడే...
అరె భాయి....ఆ పార్వతి విడిచిన దెవదాసు గాడే...


p1:futureలో నీళ్ళే కరువై బ్రతుకే నడవదులే....అప్పుడు మందే దిక్కంటా...
p2:foreignలో మందే వెయ్యని మనిషే ఉండడురా....ఇక్కడ మనకేం తక్కువరా....మనకీ అతిగా మక్కువరా...
p2:పరీక్ష పోతే ప్రియురాలు పోతే బాధే కక్కమురా...bottle దారై తోచునురా...
1st classఏ వస్తే ప్రేమే గెలిస్తే ఆనందమేకదరా....దానికి సాక్షం ఎక్కడర....మళ్ళి bottle పట్టెయ్ రా...
p3:అరె భాయి.... ఈ సిద్ధాంతం నిను ముందుకి నడపదుగా....
p3:అరె భాయి.... ఈ మధుర క్షణాన్ని ఆపెయ్యాలికదా....

Sunday, November 9, 2008

situation: confessions of a happy mind...

pallavi:

చల్లగా...గాలిలో మెల్లగా...తేలెనే నా మదీ...
హాయిగా...మౌనమే మాయగా...పాడెనే ఏమదీ...
ఊహలే రెక్కలు తొడిగే...దేహమే పులకరించెనే...
ఆశకే రంగులు కలిపి...స్వప్నమే బొమ్మ గీసెనే...
ఓ కాలమా ఆగవా....


charanam1:

నయనమే నయగారాలను గుండెలో దాచెనే...
పాదమే పారవశ్యంతొ నాట్యమే నేర్చెనే...
ఝల్లు ఝల్లు మని తుళ్ళుతున్న యే నీటి చినుకు నను కవ్వించిందో...
తెలుగు భాష నే మురిపించిన యే తీపి మాట నను నవ్వించిందో....
చిందులే వేస్తున్నా...చిలిపి లయకీ...
రాగమే తీస్తున్నా...స్వరము చిలికీ...


charanam2:

నవ్వులే తలుపుల వెనుకన తలపునే పిలిచెనే..
పువ్వులై పరిమల మధురిమ గాలిలో వదిలెనే...
ఏ ఉగాది ఈ ఎడరి దారిని బ్రుందావనముగ మార్చివేసిందొ...
ఏమనేది ఈ పిల్ల చేప ఒక సముద్రమే అన్వేషించిందో...
నిన్నలా లేదంటా....రేపిలా ఉంటుందా...
లోకమే అందంగా....మారెనే ఈ పూటా...

Tuesday, November 4, 2008

Theme: describing 'bhayam'...

నెత్తుటి మడుగుని గాంచిన కనులకు తెలిసొచ్చిందా భయం
చావుకి ఎదురుగ నిలచిన బ్రతుకుని వివరించిందా భయం
భయమే అజ్ఞానం...ఇక లేదే విశ్వాసం..
యుద్ధం అనివార్యం...వాపోయెను భూగోలం..
ఇది పొందిన మనిషికి మనుగడ దొరకదు మదిలో యే మాత్రం...



పేదకు ఆకలి భయం...ధనికుడికీ దొంగ భయం..
రాజుకి రాజ్యం భయం...సైనికుడికే లేదు భయం...
జీవన పొరాటంలొ మనిషొక సైనికుడే అయితే..
భయమే సారధి చేసుకొనిక మరి పయనిస్తాడంతే...
జింకకు సిం హం భయం...అడవులకిది న్యాయం...
పరులను మనిషిగ చూస్తే....మనమే మనకొక అభయం....


రాత్రులు దెయ్యం భయం.....తప్పుకి దైవం భయం...
ప్రియుడికి భవితే భయం...పసి పాపకు లేదేం భయం...
మనుషుల లోనే మర్మం ఎరుగని మనసే మనకుంటే...
ముసి ముసి నవ్వుల ముఖమే భయముకి యముడౌతుందంతే...
తప్పనిపించే మదికే....కనువిప్పుగ మారే భయం....
ఆ తప్పుని దాటే గుణమే....నిన్నెన్నడు చెయ్యదు నయం....

Saturday, November 1, 2008

Situation: Oka palle kurraadi katha kammamishu...(janapada geetam type)

ఎదురింటి సర్పంచి గారి కూతురూ
చాల్రోల్లు నడిపాను దాని మ్యాటెరు
మొదటి సారి చూసినపుడు నవ్వేసింది
రెండో సారి చూసినపుడు నవ్వేసింది
మూడో సారి...అహా మూడో సారి..అహా మూడో సారి చూసినపుడు చెయ్యేసింది....

ఒక రోజు...
చెరువు గట్టుకెల్తేను అది వచ్చింది
ఒక్కటిగా మునిగి స్నానం చేద్దాం అంది
దిగినాకా ఊరు వదిలి పోదామంది.....
మరి తీరా చూస్తే....తీరా చూస్తే...
తీరా చూస్తే సర్పంచి చూసేసాడు...


పక్కింటి రమణమ్మ రెండో చెల్లి
మనకంటా చిన్నది దానికవలేదు పెళ్లి

మొదటి సారి ఎళ్లి దాని పేరడిగాను
రెండో సారి ఎళ్లి దాని ఊరడిగాను
మూదో సారి...అహా మూడో సారి..అహ మూడో సారి ఇంట్లో ఎవరు లేరన్నాను...

ఒక రోజు అష్టాచెమ్మా ఆడుతూ వుంటే
తొందరలో దాని చెయ్యి పట్టెసాను
రమణమ్మకి తెలిసి దాని పెళ్లి చెసింది
రమణమ్మకి తెలిసి దాని పెళ్లి చెసింది
మరి తీరా చూస్తే....మరి తీరా చూస్తే...
ఆ వీధిలోన నాకు చెడ్డ పేరొచ్చింది...


ఇక ఇలా కాదని...

అమలాపురంలోన ఉంది నాకు మరదలు...
పెల్లి కుదిర్చారు లెండి ఇంట్లో అందరూ...

మొదటి సారి చెప్పినపుడు వద్దన్నాను...
రెండో సారి అడిగినపుడు కాదన్నాను...
మూడొ సారి ...అహా మూడో సారి...అహా మూడో సారి పెళ్లికూతురేదన్నాను...

ఊరంతా సందడిగ మారిపోయింది...
పెళ్లి రోజు పరిగెడుతూ వచ్చేసింది...
ఆత్రంతొ పీట మీద కూర్చున్నాను...
తీరా చూస్తే...అహా తీరా చూస్టె....
అహా తీరా చూస్టె మరదలేమొ పారిపోయింది....

Situation: Avesam lo anyayanni jeyinchalani aaratapadutunna oka manishi manobhavana

Pallavi:
రక్కసి మూకల చేష్టలకి నేనే ఎదురొచ్చా
టక్కరి నక్కల ఎత్తులకి కబురే పంపించా
తప్పుని కాదని ఎదిరిస్తే నిప్పై జ్వలియిస్తా
రెప్పల మాటున చీకటికే ఒప్పుని చూపిస్తా
స్వర్గం అందదని
ఈ భువినే మార్చెస్తా
ఇక కలలో కూడా కని విని ఎరుగని కొత్తదనం తెస్తా

Charanam 1:
ఎప్పుడు ఎప్పుడని
ఈ ప్రజలే చూస్తూంతే
ఇప్పుడు ఇప్పుడని
నే జవాబు ఇస్తానే

తిప్పలు తప్పవని
మీరనుకుంటూంటే
తప్పక మారునులే
అని నే చూపిస్తలే

మోసం చెసే మనుషుల ముసుగులు బట్టబయలు చేస్తా
దెశం కోరే ఆనందాన్నే పట్టపగలు తెస్తా
Charanam 2:
ఎక్కడ ఎక్కడని
ఆ లోకం ఏదంటే
ఇక్కడ ఇక్కడని
నవలోకం చూపిస్తా

చిక్కుల బ్రతుకులకే
ఇక లేవని సెలవిస్తా
చుక్కల దారికి నే
ఇక పయనం మొదలెడతా

మదిలో ఉండె కల్ముషమంతా శుభ్రం చేసెస్తా
విధినే మార్చే పనిలో నాకూ నిద్రే లెదంట...

Situation: A guy expressing his love to a heroine and she rejects it....

pallavi:
ప్రేమంటారా? ఇది ప్రేమంటారా?

M: నీ భ్రమలో మురిసే బ్రతుకు బతికే దారిని వెతుకుతు ఉంటే..................
CHO: ప్రేమంటారా? ఇది ప్రేమంటారా?
మన కలయిక కుదరని క్షణమే ఎటు కదలక శిలలా స్థంభిస్తే.............
CHO: ప్రేమంటారా? ఇది ప్రేమంటారా?

f: బ్రతిమలాడకా గతిని మార్చుకో చిక్కు ప్రశ్నతో చంపైక
M: పెను తుఫానుకే ఎదురు తిరగనా నీ తలంపునే తుదిచెయ్ గా
CHO: ప్రేమంటారా? ఇది ప్రేమంటారా?

charanam1:

M: చిన్నపిల్లలా చందమామలా లోకమంత నీ నవ్వేగా
కాదనేసినా వదలలేనుగా దరికిరాదు ఏ హాయైనా
f: ద్రుష్టి లోపమా దుష్టతాపమా ఆసకంటు ఒక అంతుందా
బుజ్జగింపుకే మాట వినవుగా కోపమైన నిను ఆపేనా

M: కోపంలో నిను చూస్తూంటే
అందం అసూయ పదుతూంటే
f: మాట మార్చి నను మార్చలేవులే పో పో పో పో పో..
CHO: ప్రేమంటారా? ఇది ప్రేమంటారా?

charanam2:

M: దూరమేలనే నీరసించెనే మదికి హాయిగా తోస్తున్నా
ఎట్టకేలకే నువు సరే అనే క్షణము కొసమె చూస్తున్నా
F: తలుపు మూసి చీకట్లొ కాంతికై అక్కడే ఎదురు చూస్తావో
అడుగు వేసి నీ కనులు కమ్మిన భ్రంతినెపుడు వదిలేస్తవో
M: ఒర్పుతోనె ఈ బ్రతుకంతా
నీ తీర్పు కోసమే బ్రతికుంటా
F: కాలమన్నది కళ్ళుమూసుకొని చూస్తూ ఉండదులే
CHO: ప్రేమంటారా? ఇది ప్రేమంటారా?

Friday, October 31, 2008

ముందుగా ఒక సంక్రాంతి కవిత తో మొదలుపెడుతున్నా

పొద్దున్నే శిశిరంలో వణుకుతూంది నింగి..
ఊరంతా వెచ్చంగా లేపుతూంది భొగి..

ముగ్గుల హరివిల్లులోన పల్లెటూర్లు అందం....
గాలిపటాలు ఎగరేస్తూ గెలుచుకున్న పంతం...

బంధు మిత్రులందరితొ నవ్వించిన హస్యం...
మారుతున్న లోకం లో మరపురాని ద్రుశ్యం...

ఇంతే ఉత్సహం తో ఉండాలని కాంక్షిస్తూ...
ఇదే నా సంక్రాంతి శుభాకాంక్షలు...