Tuesday, November 4, 2008

Theme: describing 'bhayam'...

నెత్తుటి మడుగుని గాంచిన కనులకు తెలిసొచ్చిందా భయం
చావుకి ఎదురుగ నిలచిన బ్రతుకుని వివరించిందా భయం
భయమే అజ్ఞానం...ఇక లేదే విశ్వాసం..
యుద్ధం అనివార్యం...వాపోయెను భూగోలం..
ఇది పొందిన మనిషికి మనుగడ దొరకదు మదిలో యే మాత్రం...



పేదకు ఆకలి భయం...ధనికుడికీ దొంగ భయం..
రాజుకి రాజ్యం భయం...సైనికుడికే లేదు భయం...
జీవన పొరాటంలొ మనిషొక సైనికుడే అయితే..
భయమే సారధి చేసుకొనిక మరి పయనిస్తాడంతే...
జింకకు సిం హం భయం...అడవులకిది న్యాయం...
పరులను మనిషిగ చూస్తే....మనమే మనకొక అభయం....


రాత్రులు దెయ్యం భయం.....తప్పుకి దైవం భయం...
ప్రియుడికి భవితే భయం...పసి పాపకు లేదేం భయం...
మనుషుల లోనే మర్మం ఎరుగని మనసే మనకుంటే...
ముసి ముసి నవ్వుల ముఖమే భయముకి యముడౌతుందంతే...
తప్పనిపించే మదికే....కనువిప్పుగ మారే భయం....
ఆ తప్పుని దాటే గుణమే....నిన్నెన్నడు చెయ్యదు నయం....

1 comment:

Anonymous said...

chala bavundandi...mee blog mothaniki kalipi ikkade comment chestuna..cricket bavundi mandu chindu veinchindi..manasu kavitha chala bavundi..bhayam koncham bhayappettindi....mothaniki antha adirindi...gudd work keep going..by the way frens??? na orkut id vravi89@yahoo.com pls add if ur interested thank you