Tuesday, April 28, 2009

Dedicated to the Scientist human !

(A parody to 'tikamaka makatika' song frm 'sri anjaneyam !')


సరిగమ స్వరముకు మధురిమ గుర్తించీ
పదనిస పలికిన గళమును గమనించీ
కాలాన్ని లెక్కవేసీ........ ప్రశ్నల్ని వరస పేర్చీ ........
జ్ఞానాన్ని వెతికి తీసి....... శాస్త్రాన్ని కూర్పు చేసీ ..........
వస్తువుతో పాటనే పాడించిన మనిషీ....

వింతై తోచినా మాయే అనుకున్నా
జిజ్ఞాస నడిపించే జ్ఞాన రథం వెతికిందా సృష్తిలో కణం...
నిత్యాశ వాడుకుంది ఈ విజ్ఞానం చూపింది నవోదయం...
ఈ నిత్య సుఖాలు లొకమంతటా తెలిసీ...
ఆ సత్య యుగంలా ధర్మమంతటా వెలిసీ...
నాకము నెలకొల్పరా మనిషి....

ఎదురే లేక నిదరే పోక
ఇష్తంగా పనిపెంచే ఉత్సుకతయే తెచ్చిందా భువికే అందం
తెలివంతా అర్పించే ఈ యజ్ఞాన్ని కష్టమంటూ ఎపుడూ అనం..
నీ కుతూహలానికి అడ్డుకట్టలే లేవు కదా..
నువ్ కళేబరంలా బ్రతకటానికీ కాదు కదా...
దూరాన్నే క్షణాల్లో దరిచేర్చిన మనిషి...

Monday, April 20, 2009

venki train song - tune king lo 'enthapani sestiviro'

(naagaraju: venumadhav - tc, bokka- AVS, gajjigadu - (gajala)- br)


anupallaavi :
మంచిగుంటే మీకు మంటా.... తెచ్చినాదే పెద్ద తంటా...
మందు వేస్తే ఎవ్వడైనా.... మనిషి లాగా ఉండడంటా...
pallavi:

ఎట్లగున్న పర్వలెదురో పోకిరోడ పాట పాడి పరవశింప రా రా...
కొట్టి కొట్టి సెప్పలేను రో తింగరోడ ఆటలాడి ఆదమరచిపోరా...
పొలోమంటు పారిపోతె పచ్చి నెత్తురు తాగెస్తా...
అలగనీ calmగుంటె పిచ్చ పీకుడు పీకెస్తా...
flashback గుర్తొస్తే గుండె లోన బాధరన్నా...
ఎందుకిలా సేసిందీ నాగరజు అన్న...
పోరి ఎందుకిలా సేసిందీ నాగరజు అన్న...
వీడివల్లె వీడిందీ పెళ్ళిముడోరన్నో...
వీడివల్లె వీడిందీ పెళ్ళిముడోరన్నో...

para1:

wife కొరకు ఎదురు చూసినా.... గొప్ప life time plan వెసినా...
రైలు లొన sight కొట్టిన.... గాలి లొన తేలి కేళి సేసినా...
హై అంటే నవ్వుకుందిగా....లవ్వంటే కెవ్వుమందిగా....
మనసంతా ముక్కలైందిగా.... తననైనా మరవలేనుగా....
ఎట్టాగ చెప్పు మరీ... సెయ్మాకు బెట్టు మరీ...వెయ్ రా నువ్ step మరి బొక్కా...
ఎందుకిలా సేసిందీ నాగరజు అన్న...
పోరి ఎందుకిలా సేసిందీ నాగరజు అన్న...
వీడివల్లె వీడిందీ పెళ్ళిముడోరన్నో...
వీడివల్లె వీడిందీ పెళ్ళిముడోరన్నో...

para2:
venky:
ఆశపడ్డ గుండె పగిలితే..... ఆ ఆశకింక ఊపిరేడ రా...
వెను మధవ్ :
ఇట్లగైతె ఏమి వచ్చు రా.... వీడి సంగతేంటొ చూపు చూడరా...
venky:
పొద్దున్నే తగిలాడే శనిగాదు గజ్జిగాదిలా...
మనిషేమో పొట్టోడూ ఊరుకుంటే కసురుతాడిలా...
చెసాడే తప్పు మరీ.... అడగాలే సారి అనీ.... రేయంతా నిదరపొమాకా...
వీడివల్లె వీడిందీ పెళ్ళిముడోరన్నో...
ఎదవ వీడివల్లె వీడిందీ పెళ్ళిముడోరన్నో...
ఎందుకిలా సేసిందీ నాగరజు అన్న...
పోరి ఎందుకిలా సేసిందీ నాగరజు అన్న...