Tuesday, April 28, 2009

Dedicated to the Scientist human !

(A parody to 'tikamaka makatika' song frm 'sri anjaneyam !')


సరిగమ స్వరముకు మధురిమ గుర్తించీ
పదనిస పలికిన గళమును గమనించీ
కాలాన్ని లెక్కవేసీ........ ప్రశ్నల్ని వరస పేర్చీ ........
జ్ఞానాన్ని వెతికి తీసి....... శాస్త్రాన్ని కూర్పు చేసీ ..........
వస్తువుతో పాటనే పాడించిన మనిషీ....

వింతై తోచినా మాయే అనుకున్నా
జిజ్ఞాస నడిపించే జ్ఞాన రథం వెతికిందా సృష్తిలో కణం...
నిత్యాశ వాడుకుంది ఈ విజ్ఞానం చూపింది నవోదయం...
ఈ నిత్య సుఖాలు లొకమంతటా తెలిసీ...
ఆ సత్య యుగంలా ధర్మమంతటా వెలిసీ...
నాకము నెలకొల్పరా మనిషి....

ఎదురే లేక నిదరే పోక
ఇష్తంగా పనిపెంచే ఉత్సుకతయే తెచ్చిందా భువికే అందం
తెలివంతా అర్పించే ఈ యజ్ఞాన్ని కష్టమంటూ ఎపుడూ అనం..
నీ కుతూహలానికి అడ్డుకట్టలే లేవు కదా..
నువ్ కళేబరంలా బ్రతకటానికీ కాదు కదా...
దూరాన్నే క్షణాల్లో దరిచేర్చిన మనిషి...

No comments: